Home > తెలంగాణ > Breakfast Scheme : సర్కారీ బడుల్లో అల్పాహారం.. దసరా నుంచి అమలు..

Breakfast Scheme : సర్కారీ బడుల్లో అల్పాహారం.. దసరా నుంచి అమలు..

Breakfast Scheme : సర్కారీ బడుల్లో అల్పాహారం.. దసరా నుంచి అమలు..
X

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించిన కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదవే విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. ఉదయం వేళలో చాలా మంది స్టూడెంట్స్ ఆహారం తీసుకోకుండా స్కూళ్లకు వస్తుంటారు. ఈ క్రమంలో వారు ఆకలితో ఇబ్బంది పడకుండా అల్పహారం అందించనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధనతో పాటు పోషకాహారం అందించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగానే అల్పాహార పథకం అమలు చేయనుంది. తమిళనాడులో ఇప్పటికే ఈ పథకం అమలవుతుండటంతో సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారుల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపి అమలుతీరుపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆ మేరకు అధికారులు అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అల్పాహార పథకం అమలు చేస్తుండగా.. తెలంగాణలో మాత్రం పదో తరగతి వరకు ఈ విధానం అమలుచేయాలని నిర్ణయించారు. అల్పాహర పథకం అమలుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా దాదాపు రూ.400 కోట్ల అదనపు భారం పడనుంది.




Updated : 15 Sept 2023 8:24 PM IST
Tags:    
Next Story
Share it
Top