పుట్టిన రోజు సోకులో పడి ప్రజల్ని మర్చిపోయిండు : రేవంత్
X
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ ప్రజలు అతలాకుతలం అవుతుంటే.. వాళ్లకు రక్షణ కల్పిచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజలకు మొండి చేయి ఎదురైందని ఆరోపించారు. తీవ్ర పరిణామాల మధ్య ప్రజలు అవస్తలు పడుతుంటే.. మంత్రి కేటీఆర్ మాత్రం పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారని విమర్శించారు. వర్షాలు.. వరదల వల్ల హైదరాబాద్ అల్లకల్లోలంగా మారింది. రోడ్లపై తిరాగాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలను మర్చిపోయి, పుట్టిన రోజు మోజులో పడి ప్రజలను గాలికి వదిలేశారని అన్నారు.
రానున్న రోజుల్లో తీవ్రమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. గంటలకొద్దీ రోడ్లపైనే నిలిచిపోతున్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా, రాబోయే రోజుల్లో డల్లాస్ ను చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. అధికారం చేపట్టి 9 ఏళ్లవుతున్నా హైదరాబాద్ లో మౌలిక వసతులు కల్పించడంలో దారుణంగా ఫెయిల్ అయిందని మండిపడ్డారు. బుధ, గురు వారాల్లో ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని, లేదంటే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గ్రేటర్ మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.