Home > తెలంగాణ > Breaking News : ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్.. ఆ పద్ధతి ద్వారా లైసెన్స్ల ఎంపిక

Breaking News : ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్.. ఆ పద్ధతి ద్వారా లైసెన్స్ల ఎంపిక

Breaking News : ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్.. ఆ పద్ధతి ద్వారా లైసెన్స్ల ఎంపిక
X

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇప్పుడున్న 2,620 మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగుస్తుండటంతో.. లైసెన్సుదారుల ఎంపికకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ నుంచి మద్యం షాపుల ఏర్పాటుకు కొత్త లైసెన్స్లను లాటరీ ద్వారా మంజూరు చేస్తారు.

కాగా, దరఖాస్తు, లైసెన్సుల ఫీజులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ నెల 3న జిల్లాల వారీగా ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ నెల 4 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్ట్ 21న డ్రా ద్వారా మద్యం షాపుల లైసెన్సులు జారీ చేస్తారు. ఈసారి అప్లికేషన్ ఫీజును రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. పోయిన సారి విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా.. తిరిగి ఇవ్వని అప్లికేషన్ ఫీజు రూ. 1350 కోట్లు, దుకాణాల లైసెన్స్ ఫీజు కింద దాదాపు రూ. 3500 కోట్లు ఆదాయం లభించింది.

Updated : 2 Aug 2023 7:51 PM IST
Tags:    
Next Story
Share it
Top