Home > తెలంగాణ > Dasara holidays: రేపటి నుంచి దసరా సెలవులు.. కానీ!

Dasara holidays: రేపటి నుంచి దసరా సెలవులు.. కానీ!

Dasara holidays: రేపటి నుంచి దసరా సెలవులు.. కానీ!
X

తెలంగాణ పెద్ద పండుగ బతుకమ్మ, దసరాకు వేళయింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు.. (Dasara holidays) ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటిస్తుంది. మొదట దసరా సెలవును అక్టోబర్ 24 అని ప్రకటించగా.. తర్వాత తేదీని మార్చుతూ అక్టోబర్ 23న పండగ జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. దీంతో ఈ రెండు పండుగలకు కలిపి మొత్తం 13 రోజులు సెలవులు రానున్నాయి. 2022లో ప్రభుత్వం 14 రోజుల సెలవులు ఉండగా.. ఈ ఏడాది 13 రోజుల సెలవులే ప్రకటించింది.

అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలలు తెరుచుకుంటాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు బుధవారం ముగియగా.. ఫలితాలు మాత్రం సెలవుల అనంతరం వెల్లడిస్తారు. మరో వైపు ఫార్మెటివ్ అసెస్మెంట్-1,2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో అప్ లోడ్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. కాగా జూనియర్ కాలేజీలకు ఈనెల 19 వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు.




Updated : 12 Oct 2023 9:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top