30% PRC.. ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
X
తెలంగాణ సాంస్కృతిక సారధి(TSS) ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగులందరికీ పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్‌సీ అమలుకు చర్యలు తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. మూడు నెలల కిత్రం టీఎస్‌ఎస్ ఉద్యోగుల పీఆర్‌సీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా సీఎం కేసీఆర్ ఆమోదంతో ఈ రోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్‌ఎస్ ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. పెరగనున్న పీఆర్సీ 2021 జూన్ 1వ తేదీ నుంచి వర్తించనుంది.
తెలంగాణ సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం పే స్కేలు మీద 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగుల పేస్కేలు రూ.24,514 ఉండగా.. నూతన పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు ఒక్కొక్కరికీ రూ. 7,300 మేర పెరగనున్నాయి. ఈ కీలక ప్రకటనతో ఆయా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్తున్నారు.
ఇదిలా ఉంటే.. మొన్ననే రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ వయసును ప్రభుత్వం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వాళ్ల రిటైర్మెంట్ వయసును 61 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.పదవీ విరమణ చేసిన అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లతో పాటు హెల్పర్లకు రూ. 50 వేల ఆర్థిక సాయంతో పాటు రిటైర్మెంట్ తర్వాత.. ఆసరా పింఛన్లు కూడా మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది.