Home > తెలంగాణ > మధ్యాహ్నా భోజనంలో విద్యార్థులకు చేపల కూర

మధ్యాహ్నా భోజనంలో విద్యార్థులకు చేపల కూర

మధ్యాహ్నా భోజనంలో విద్యార్థులకు చేపల కూర
X

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం(Mid Day Meals)లో భాగంగా చేపల కూరను చేర్చాలని మత్స్యశాఖ యోచిస్తున్నది. ఇందుకు సంబంధించి మత్స్య ఫెడరేషన్‌ కసరత్తు చేస్తున్నది. మొత్తం విద్యార్థులు ఎంత మంది? వారికి ఎన్ని రోజులు చేపల కూర వడ్డించాలి, ఒక్కొక్కరికి ఎన్ని గ్రాములు అవసరం, పిల్లలందరికీ కలిపి ఎంత మొత్తంలో చేపలు అవసరం అవుతాయి, ఇందుకు నిధుల సమీకరణ ఎలా అనే అంశంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఈ కసరత్తు పూర్తి కాగానే ఫుల్ రిపోర్ట్(Full Report) ను ప్రభుత్వానికి అందించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.

విద్యార్థులకు చేపల తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలనే ఉద్దేశంతో మత్స్యశాఖ మంగళవారం అవగాహన సదస్సును ఏర్పాటు చేసింది. రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య రాష్ట్ర చైర్మన్‌ పిట్టల రవీందర్‌ దుబ్బాక(Dubbaka) నుంచే ఈ సదస్సును ప్రారంభించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ విద్యాబుద్ధులు నేర్చిన దుబ్బాక నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో చేపల వల్ల ఆరోగ్యానికి కలిగే మేలును విద్యార్థులకు వివరించనున్నారు. చేపల్లోని పక్క బొక్కలు, ముల్లును ఎలా తొలగించి తినాలనేదానిపై కూడా వారికి తెలియజేయనున్నారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనంలో ఒక్కరోజు చేపల కూరను అందించాలనే ప్రతిపాదనకు కూడా రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్యశ్రీకారం చుట్టనున్నట్లు తెలిసిందిరు. రాష్ట్రంలో మత్స్య సంపద పెరగడంతో వాటిని వినియోగించడం వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదించే ముందు, విద్యార్థులకు చేపలపై అవగాహన కల్పించేందుకు మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు.

Updated : 19 July 2023 2:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top