కొత్తగూడెం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తా.. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
X
సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడంతోపాటు పలు సందర్భాల్లో వింత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుక్కున్న తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు జోరు పెంచారు. తను కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పారు. అక్కడి ప్రజలు ఏం కోరుకున్నా నెరవేరుస్తానని అన్నారు. ఆయన ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో డాక్టర్ జీఆర్‌ఎస్ ట్రస్ట్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇప్పటికే తేల్చిచెప్పిన శ్రీనివాసరావు తను ముషీరాబాద్ నుంచిపోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.
‘‘కేసీఆర్ ఆదేశిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను. చేస్తే కొత్తగూడెం నుంచే పోటీ చేస్తాను, లేకపోతే పోటీనే చేయను. కొత్తగూడెం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జీఎస్‌ఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్నాను. ఈ గడ్డమీద పుట్టిన నాకు ఇదే ఆఖరి మజిలీ. ఏడేళ్ల సర్వీసు వదలుకుని మరీ రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నాను. ఆస్తులు సంపాదించుకోవాలని రావడం లేదు. నాకు ఒక్క కూతురి బాధ్య కూడా తీరిపోయింది. కొత్తగూడెం నియోజకవర్గం బీసీలది. చుట్టపు చూపుగా వచ్చిపోతున్నానని నాపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా. నా శరీరం మాత్రమే హైదరాబాద్‌లో ఉంది, నా మనసు ఇక్కడే ఉంది’’ అని అన్నారు.
మొన్నటి వరకు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉండిన బీఆర్ఎస్ నేత వనమా వెంకటేశ్వరరావుపై ఆ పదవికి అర్హుడు కాదని హైకోర్టు ఇటీవ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన చేతిలో ఓడిపోయి రెండోస్థానోంల నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్‌లో సమాచారం ఇచ్చారని ఆయనపై కోర్టు అనర్హతవేటు వేసింది. వనమా పక్కకు తప్పుకోవడంతో కొత్తగూడెంపై గడలతోపాటు మరికొందరు ఆశావహులు కన్నేశారు.