Home > తెలంగాణ > నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలమ్ ను చేర్చాలని తీర్పునిచ్చిన హైకోర్టు

నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలమ్ ను చేర్చాలని తీర్పునిచ్చిన హైకోర్టు

నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలమ్ ను చేర్చాలని తీర్పునిచ్చిన హైకోర్టు

నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలమ్ ను చేర్చాలని తీర్పునిచ్చిన హైకోర్టు
X



కులం, మతం విషయాల మీద హైకోర్టు ఈరోజు సంచలన తీర్పును ఇచ్చింది. ప్రజలు తాము ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండే హక్కు వాళ్ళకుందని చెప్పింది. విద్యతో పాటూ అన్ని దరఖాస్తుల్లోనూ నో క్యాస్ట్, నో రెలిజియన్ అనే కాలమ్ ను తప్పకుండా చేర్చాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను ఇచ్చింది.

2019లో తమ కుమారుడికి నో క్యాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికేట్ ఇవ్వాలని సండెపు స్వరూప అనే ఆమె అధికారులకు వినతి పత్రం అందజేశారు. చాలాసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో స్వరూప, మరొకరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. వాదనల తర్వాత జస్టిస్ కన్నెగంటి లలిత ఉత్తర్వులను జారీ చేశారు. పిటిషనర్ అభ్యర్ధనను తోసిపుచ్చడం మానవ హక్కులకు భంగం కలిగించడమే అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 25లను ఉల్లఘించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛతో పాటూ మరికొన్ని హక్కులు పౌరులకు ఉన్నాయి. అందులో ఏ మతాన్ని, కులాన్ని ఆచరించాలి, ఆచరించకూడదనే హక్కు పౌరులకు ఉంటుంది అన్నారు జస్టిస్. ఆర్టికల్ 19 కూడా ఇదే చెబుతుందని చెప్పారు.

నో క్యాస్ట్, నో రిలిజియన్ అనే కాలాన్ని అన్ని దరఖాస్తుల్లో , ఆన్ లైన్ లో కూడా చేర్చాలని....మున్సిపల్ కమిషనర్లకు, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితో పాటూ ఇతర ప్రభుత్వశాఖలకూ ఆదేశాలను జారీ చేస్తున్నాం అని జస్టిస్ లలిత తీర్పులో తెలిపారు.


Updated : 20 July 2023 12:19 PM IST
Tags:    
Next Story
Share it
Top