Home > తెలంగాణ > గాదరి కిషోర్కు హైకోర్టు ఝలక్.. పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం..

గాదరి కిషోర్కు హైకోర్టు ఝలక్.. పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం..

గాదరి కిషోర్కు హైకోర్టు ఝలక్.. పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం..
X

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్కు హైకోర్టు షాకిచ్చింది. తన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి సాక్షుల లిస్ట్ ఫైనల్ చేయాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను వారం పాటు వాయిదా వేసింది.

గాదరి కిషోర్ తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అద్దంకి దయాకర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అద్దంకి దయాకర్ పిటిషన్ ను కొట్టివేయాలని హైకోర్టులో గాదరి కిషోర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ స్వీకరణపై ఇవాళ నిర్ణయం తీసుకున్న ధర్మాసనం.. దాన్ని కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

రాష్ట్రంలో మరో 3 - 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. అందులో తుంగతుర్తి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి గాదరి కిషోర్కు టికెట్ దక్కింది.




Updated : 28 Aug 2023 7:14 PM IST
Tags:    
Next Story
Share it
Top