Home > తెలంగాణ > బుద్వేల్‌లో 5 రూపాయలకు 5 ఎకరాల కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు

బుద్వేల్‌లో 5 రూపాయలకు 5 ఎకరాల కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు

బుద్వేల్‌లో 5 రూపాయలకు 5 ఎకరాల కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
X

హైదరాబాద్ బుద్వేల్‌లో ఓ ట్రస్టుకు కేవలం ఒక రూపాయికే ఎకరం చొప్పున 5 రూపాయలకు 5 ఎకరాలను కేటాయించడంపై తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏ కారణం వల్ల ఈ కేటాయింపులు జరిపారో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో బుద్వేల్‌లో సర్వే నం.325/3/2లోని ఐదు ఎకరా భూమిని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీకి దఖలు పరిచింది. దీనికి సంబంధించి అదే ఏడాది సెప్టెంబరు 9న 195 జీవోను జారీ చేసింది.

ఈ సంగతి ఆలస్యంగా బయటికి రావడంతో కోటేశ్వరరావు అనే సామాజిక కార్యకర్త మరొకరితో కలసి కోర్టుకెక్కారు. విలువైన భూములను ప్రజల కోసం కాకుండా ఇష్టారాజ్యంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ జరిపింది. జీవో సంగతి ఆలస్యంగా తెలియడంతో కోర్టును వచ్చామని, కేటాయింపు రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే కేటాయింపు సమంజసమేనని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదించారు. పూర్తి కారణాలతో కోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తామని చెప్పడంతో విచారణను వాయిదాపడింది. చివరి నిజాం నవాబు హయాంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. ఈ పదవి చేపట్టిన తొలి హిందువుగా రికార్డుకెక్కిన వెంకట్రామారెడ్డి పలు ప్రజాసంస్థలకు సాయం చేశారు. రెడ్డి హాస్టల్ ఆయన స్థాపించినదే.

Updated : 29 Aug 2023 12:57 PM IST
Tags:    
Next Story
Share it
Top