Home > తెలంగాణ > SI and constable results issue : ఎస్ఐ, కానిస్టేబుళ్ల పరీక్షా ఫలితాలపై హైకోర్టు స్టే

SI and constable results issue : ఎస్ఐ, కానిస్టేబుళ్ల పరీక్షా ఫలితాలపై హైకోర్టు స్టే

SI and constable results issue : ఎస్ఐ, కానిస్టేబుళ్ల పరీక్షా ఫలితాలపై హైకోర్టు స్టే
X

ఎస్ఐ, కానిస్టేబుళ్ల ఫలితాలపై హైకోర్టు స్టే విధించింది. వారం రోజుల పాటు ఫలితాలు వెల్లడించవద్దంటూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 57, 58లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం వారంలోపు కౌంటర్ దాఖలు చెయ్యాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది.

ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తైన తరువాత రిక్రూట్మెంట్ బోర్డు జీవో నెంబర్ 57, 58ను తెరపైకి తెచ్చింది. వాటి ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కటాఫ్ మార్కులను బోర్డ్ నిర్ణయించింది. అయితే నోటిఫికేషన్‌లో ఎక్కడ కూడా జీవో నెంబర్ 57, 58లను ప్రస్తావించలేదని అభ్యర్థులు అంటున్నారు. రిజర్వేషన్లపై కటాఫ్ మార్కులు ఉన్నాయని బోర్డ్ వెల్లడించలేదని కోర్టుకు చెప్పారు. ప్రిలిమ్స్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయం వల్ల పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ తీవ్ర నష్టం వాటిల్లిందని పిటిషన్ లో ప్రస్తావించారు. పోలీస్ రిక్యూట్ మెంట్ బోర్డ్‌పై ఇప్పటి వరకు హైకోర్టులో 52 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది.




Updated : 3 Aug 2023 4:12 PM IST
Tags:    
Next Story
Share it
Top