Home > తెలంగాణ > విద్యార్థులకు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్

విద్యార్థులకు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్

విద్యార్థులకు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్
X

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఐసెట్‌ తుది విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ కొనసాగుతున్నది. వెబ్‌ ఆప్షన్ల గడువు ఆదివారంతో ముగియనున్నది. శనివారం వరకు 11,839 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను ఎంచుకున్నారు. ఇక ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌కు 10,762 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 729 ఎంసీఏ, మిగిలినవి ఎంబీఏ సీట్లు. సెప్టెంబ‌రు 22 నుంచి 24 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 28వ తేదీలోపు సీట్లను కేటాయిస్తామని అధికారులు సూచించారు.

సీట్లు పొందినవారు సెప్టెంబరు 28 నుంచి 30 లోపు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబరు 29, 30 తేదీల్లో నేరుగా కళాశాలకు వెళ్లి మరోమారు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకొని సీటు కేటాయింపును నిర్దారించుకోవాలి. ఇక సెప్టెంబర్ 29న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో నిర్వహించిన 'టీఎస్ ఐసెట్‌-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశపరీక్షలో మొత్తం 61,092 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సెప్టెంబరు 6న ఐసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబ‌రు 15న‌ సీట్లను కేటాయించారు. ఎంబీఏలో 87.33 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీకాగా, ఎంసీఏలో అన్ని సీట్లు నిండాయి. ఐసెట్‌లో 61,092 మంది ఉత్తీర్ణులుకాగా.. ధ్రువపత్రాల పరిశీలనకు కేవలం 31,552 మందే హాజరయ్యారు.




Updated : 24 Sep 2023 1:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top