టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల
X
టీఎస్ సెట్ – 2023 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన ఈ పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు telanganaset.org వెబ్ సైట్లో హాల్ టికెట్ నెంబర్, పుట్టిన రోజు ఎంటర్ చేసి స్కోర్ కార్డులను పొందవచ్చని అధికారులు చెప్పారు. అర్హత సాధించిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. ఫలితాలతో పాటు సబ్జెక్టుల వారీగా తుది కటాఫ్, సబ్జెక్టుల వారీగా విశ్లేషణ, ఫైనల్ ఆన్సర్ కీలను సైతం ఉస్మానియా వర్సిటీ విడుదల చేసింది. టీఎస్ సెట్పై మరిన్ని వివరాలను అభ్యర్థులు TS SET అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
టీఎస్ సెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు
అభ్యర్థులు telanganaset.org వెబ్‌సైట్ హోం పేజీలో ఉన్న టీఎస్ సెట్ రిజెల్ట్స్ 2023 లింక్‌పై క్లిక్ చేయాలి.
అభ్యర్థుల స్కోర్‌కార్డు లింక్ పేజీ ఓపెన్ అవుతుంది.
లాగిన్ వివరాలను పూరించి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి.
అభ్యర్థుల స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.