Home > తెలంగాణ > TS SET : అభ్యర్థులకు అలర్ట్..TS SET దరఖాస్తుల గడువు పెంపు

TS SET : అభ్యర్థులకు అలర్ట్..TS SET దరఖాస్తుల గడువు పెంపు

TS SET  : అభ్యర్థులకు అలర్ట్..TS SET దరఖాస్తుల గడువు పెంపు
X

ఈ మధ్యనే తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కశాశాలలో లెక్చరర్ల పోస్టలకు అర్హత సాధించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఏడాది ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందు కోసం ఆగస్టు 5న దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. కాగా ఈ పరీక్షలకు అప్లై చేసుకునే చివరి తేదీ నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలో అధికారులు తాజాగా దరఖాస్తుల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు గడువును పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు.





ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి రుసుము లేకుండా సెప్టెంబర్ 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు పూర్తైన తర్వాత అప్లై చేసేవారు రూ.1500 లేట్ ఫీజుతో రుసుంతో సెప్టెంబర్‌ 10వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 2 వేల లేట్ ఫీజుతో సెప్టెంబర్‌ 18వరకు, రూ.3వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్‌ 24 వరకు అప్లై చేసుకునే సమయం ఇచ్చారు. వీటికి తోడు అభ్యర్థులు అదనంగా రిజిస్ట్రేషన్‌ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో దరఖాస్తులను సవరించుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్‌ 20 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో TS SET పరీక్షలు అక్టోబర్‌ 28, 29, 30 తేదీల్లో జరుగుతాయి. క్వాలిఫైడ్ క్యాండిడేట్లు అర్హులైన అభ్యర్థులు http://telanganaset.org/index.htm అనే వెబ్‎సైట్‎లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ TS SET పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉండనున్నాయి.






Updated : 30 Aug 2023 4:02 PM IST
Tags:    
Next Story
Share it
Top