కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదల
Kiran | 4 Oct 2023 8:37 PM IST
X
X
తెలంగాణలో కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలను పోలీసు నియామక మండలి ప్రకటించింది. 15,750 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడించింది. పోస్టులవారీగా ఎంపికైన అభ్యర్థుల్లో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థుల పూర్తి ఫలితాలు, కటాఫ్ మార్కులకు సంబంధించి పూర్తి వివరాలను అక్టోబర్ 5 ఉదయానికల్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది.
కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నందున మరికొన్ని పోస్టుల ఫలితాలను నియామక మండలి ప్రకటించలేదు. పీటీవోలో 100 డ్రైవర్ పోస్టులు, డీఆర్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగంలో నోటిఫై చేసిన 225 ఖాళీలకు ఎంపికైన వారి వివరాలను తర్వాత ప్రకటిస్తామని చెప్పింది.
Updated : 4 Oct 2023 8:37 PM IST
Tags: telangana carrer tslprb constable final results cutoff marks october 5 court cases pto drivers dr and fire services constable results dgp office final written exam results
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire