Home > తెలంగాణ > ఎస్సై పరీక్షల తుది ఫలితాలు విడుదల

ఎస్సై పరీక్షల తుది ఫలితాలు విడుదల

ఎస్సై పరీక్షల తుది ఫలితాలు విడుదల
X

ఎస్సై, ఏఎస్‌ఐ పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ప్రకటించింది. కటాఫ్‌ మార్కుల ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు తాజాగా ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేశారు. 443 మంది పురుషులు, 153 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రకటించింది.





554 ఎస్సై పోస్టుల భర్తీకి TSLPRB 2022 నోటిఫికేషన్ జారీ చేయగా గతేడాది ఆగస్టు 7న ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. దాదాపు 2.47 లక్షల మంది పరీక్ష రాశారు. 2022 అక్టోబర్ లో సివిల్‌ ఎస్​ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఈ పరీక్షలో 46.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అనంతరం వీరికి ఫిజికల్ టెస్టులు నిర్వహించి.. అందులో ఉత్తీర్ణులైన వారికి తుదిరాత పరీక్ష నిర్వహించింది.



Updated : 6 Aug 2023 10:48 PM IST
Tags:    
Next Story
Share it
Top