Home > తెలంగాణ > గ్రూప్-2 ఎగ్జామ్ కొత్త డేట్స్ ఇవే

గ్రూప్-2 ఎగ్జామ్ కొత్త డేట్స్ ఇవే

గ్రూప్-2 ఎగ్జామ్ కొత్త డేట్స్ ఇవే
X

టీఎస్పీఎస్సీ గ్రూప్ - 2 పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2 నిర్వహించాల్సి ఉండగా.. వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు శనివారం (ఆగస్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రకటించారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఆదివారం మద్యాహ్నం కొత్త తేదీలను ప్రకటించింది. ఈ క్రమంలో గ్రూప్ 2 పరీక్షను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పరీక్షకు వారం ముందు అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.




Updated : 13 Aug 2023 12:25 PM GMT
Tags:    
Next Story
Share it
Top