Home > తెలంగాణ > TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ

TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ

TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ
X

ఈ ఏడాది జూన్ 11న TSPSC నిర్వహించిన ప్రిలిమ్స్ గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్‌-1 పరీక్షల్లో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కీలక తీర్పు వెలువడించింది. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్ ఇచ్చారని అభ్యర్థులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‍‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం TSPSC Group 1 పరీక్షను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. తాజాగా పరీక్ష రద్దుపై టీఎస్ పీఎస్సీ సోమవారం అప్పీలుకు వెళ్లింది. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. అత్యవసర విచారణ నిమిత్తం లంచ్ మోషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై మంగళవారం విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అంగీకరించింది.

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు నేపథ్యంలో అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని.. మూడోసారి రాయడమంటే వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని TSPSC కమిషన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ (TSPSC) అప్పీలు చేసింది.

ఈ ఏడాడి జూన్ 11వ తేదీన నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షపై శనివారం (సెప్టెంబర్‌ 23) హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. హాల్ టికెట్ నెంబర్ లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated : 25 Sept 2023 12:27 PM IST
Tags:    
Next Story
Share it
Top