Home > తెలంగాణ > TSPSC : పేపర్ లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్

TSPSC : పేపర్ లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్

TSPSC : పేపర్ లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
X

పేపర్ లీకేజీ కేసులో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ కొనుగోలు చేసిన మరో 13 మంది అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే ఏ నియామక పరీక్షకు కూడా వారు హాజరుకాకుండా జీవితకాల నిషేధం విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 37 మందిని డిబార్ చేస్తూ టీఎస్పీఎస్సీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో శాశ్వతంగా డిబారైన అభ్యర్థుల సంఖ్య 50కి చేరింది. అయితే నిషేధం విధించిన అభ్యర్థులు కమిషన్ కు వివరణ ఇచ్చుకునేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది.



డిబారైన అభ్యర్థులు

పూల రవి కిశోర్

రాయపురం విక్రమ్

రాయపురం దివ్య

ధనావత్ భరత్ నాయక్

పశికంటి రోహిత్ కుమార్

గాదె సాయి మధు

లోకిని సతీష్ కుమార్

బొడ్డుపల్లి నర్సింగ్ రావు

గుగులోత్ శ్రీను నాయక్

భూక్యా మహేష్

ముడావత్ ప్రశాంత్

వదిత్యా నరేష్

పూల రమేష్ కుమార్

ఇదిలా ఉంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన డీఈ రమేష్ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలను ప్రస్తావించారు. టీఎస్పీఎస్సీ నిర్వహించే 3 పేపర్లను లీక్ చేసి రూ.10 కోట్లు సంపాదించాలని రమేష్ ప్లాన్ వేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. రమేష్ ఏఈ, డీఏవో పేపర్‌‌లను30 నుంచి 50 మంది అభ్యర్థులకు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో అభ్యర్థి నుంచి అతను రూ.20 నుంచి 30 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు చెప్పారు. పెద్దపల్లిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో డీఈగా పనిచేస్తున్న రమేష్ తన భార్య హత్య కేసులో నిందితునిగా ఉన్నాడు.

Updated : 31 May 2023 9:19 PM IST
Tags:    
Next Story
Share it
Top