Home > తెలంగాణ > ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష..TSPSC

ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష..TSPSC

ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష..TSPSC
X

గ్రూప్‌-2 పరీక్షలపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లు, గ్రూప్‌-1, గ్రూప్‌-4 ఎగ్జామ్స్ రిజల్ట్ , కోర్టు కేసులు తదితర అంశాల కీలకంగా చర్చకు వచ్చాయి. ఈమధ్యనే గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని కొంతమంది టీఎస్‌పీఎస్సీని ఆశ్రయించారు. మరికొందరు షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష జరపాలని కమిషన్‌ను కోరారు. ఈ క్రమంలో ఎట్టకేలకు టీఎస్‌పీఎస్సీ తాజాగా గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీలో నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు అన్ని ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్‌లోని టీఎస్‏పీఎస్పీ కార్యాలయంలో మంగళవారం కమిషన్‌ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డితో పాటు సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి కీలక చర్చ జరిగింది. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణతో పాటు గ్రూప్-1,4 పరీక్షల ఫలితాలకు సంబంధించి సభ్యులు కీలకంగా చర్చించారు.

గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్‎పై ఈ వారంలో హైకోర్టులో ఓ కొలిక్కి వస్తుందని ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం. కోర్టు నుంచి క్లియరెన్స్‌ రాగానే రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా గ్రూప్‌-4 ఓఎమ్మార్‌ షీట్ల స్కానింగ్‌ పూర్తి కావడంతో వీటి కీలను కూడా పదిరోజుల్లో ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కీ విడుదలైన నాలుగైదు రోజులకే రిజట్స్ అనౌన్స్ చేయాలని భావిస్తోంది. గ్రూప్‌-3 పరీక్ష నిర్వహణ తేదీ పైనా కమిషన్‌ చర్చించింది.

తతతఆగస్టు నెల 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణపై ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలతో సంస్థ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సమావేశం అయ్యారు. సిబ్బంది కేటాయింపు పనులు దాతాపు పూర్తయ్యాయి. పరీక్ష నిర్వహణ తేదీల్లో పలు కేంద్రాలకు విద్యాశాఖ సెలవులను కూడా ప్రకటించింది.

Updated : 9 Aug 2023 9:30 AM IST
Tags:    
Next Story
Share it
Top