Home > తెలంగాణ > Big Breaking : తెలంగాణలో మళ్లీ గ్రూప్ 1 పరీక్షలు రద్దు

Big Breaking : తెలంగాణలో మళ్లీ గ్రూప్ 1 పరీక్షలు రద్దు

Big Breaking : తెలంగాణలో మళ్లీ గ్రూప్ 1 పరీక్షలు రద్దు
X

తెలంగాణ హై కోర్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విషయంలో కీలకమైన తీర్పును ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ జూన్ 11న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‎ను రద్దు చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల సమయంలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని సరిగా అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు హై కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన కోర్టు…తాజాగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ గ్రూప్ 1 నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల నిర్వహించిన గ్రూప్‌‌‌‌–1 ప్రిలిమ్స్‌‌‌‌ పరీక్షను రద్దు చేస్తూ మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ కొంత మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ ‌‌‌ దాఖలు చేశారు. ఎగ్జామ్ రేసేందుకు వచ్చిన అభ్యర్థుల బయోమెట్రిక్‌‌‌‌ తీసుకోలేదని, వారికి ఇచ్చిన ఓఎంఆర్‌‌‌‌ షీట్‌‌‌‌లో హాల్‌‌‌‌ టికెట్‌‌‌‌ నంబర్‌‌‌‌ కూడా లేదని పిటిషన్‎లో వారు తెలిపారు. ఇలాంటి ఓఎంఆర్‌‌‌‌ షీట్‌‌ కారణంగా పరీక్ష పత్రాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుందని ఆరోపించారు. గ్రూప్‌‌‌‌–1 ప్రిలిమ్స్‌‌ ఎగ్జామ్స్ నిర్వహణ సరిగా లేదని, వెంటనే జరిగిన పరీక్షను రద్దు చేయాలని అభ్యర్థులు హై కోర్టును అభ్యర్థించారు. ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా హై కోర్టు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీకి ఉత్తర్వులు పంపింది.




Updated : 23 Sep 2023 5:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top