నేడే TSPSC ఎగ్జామ్.. కేవలం హైదరాబాద్లో మాత్రమే..
X
GHMC పరిధిలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షాల కారణంగా వాయిదా పడ్డ TSPSC పరీక్ష నేడు జరుగనుంది. తెలంగాణ భూగర్భ జలశాఖలో వివిధ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి రాత పరీక్షను నేడు(జులై 31) ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు TSPSC అధికారులు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను గత వారమే(జులై 25న) టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. కేవలం హైదరాబాద్లో మాత్రమే ఈ పరీక్ష జరుగనుంది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్లో పేపర్-1 (జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో పేపర్-2 (వాటర్ రిసోర్సెస్) పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 300 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు - 150 మార్కులు, పేపర్-2 వాటర్ రిసోర్సెస్ నుంచి 150 ప్రశ్నలు - 150 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 తెలుగు, ఇంగ్లిష్లో; పేపర్-2 కేవలం ఇంగ్లిష్లో మాత్రమే ఉంటుంది.
తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గతేడాది నవంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 7 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించింది.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 25
1) టెక్నికల్ అసిస్టెంట్ - హైడ్రోజియోలజీ: 07 పోస్టులు
అర్హత: జియోలజీ/ అప్లయిడ్ జియోలజీ/హైడ్రోజియోలజీ విభాగాల్లో ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ (లేదా) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ధన్బాద్ నుంచి డిప్లొమా అసోసియేట్షిప్ (అప్లయిడ్ జియోలజీ) ఉండాలి.
జీతం: రూ.51,320 - రూ.1,27,310.
2) టెక్నికల్ అసిస్టెంట్ - హైడ్రోలజీ: 05 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్). జియోలజీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. (లేదా) ఎంఎస్సీ (హైడ్రోలజీ) రెండేళ్ల కోర్సు చేసి ఉండాలి.
జీతం: రూ.51,320 - రూ.1,27,310.
3) టెక్నికల్ అసిస్టెంట్ - జియోఫిజిక్స్: 08 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ - జియోఫిజిక్స్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
జీతం: రూ.51,320 - రూ.1,27,310.
4) ల్యాబ్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: సైన్స్ డిగ్రీ. కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
జీతం: రూ.32,810 - రూ.96,890.
5) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు
అర్హత: బీఎస్సీ (జియోలజీ/మ్యాథమెటిక్స్).
జీతం: రూ.32,810 - రూ.96,890.