Home > తెలంగాణ > సికింద్రాబాద్ టు మణికొండ.. వయా మెహిదీపట్నం

సికింద్రాబాద్ టు మణికొండ.. వయా మెహిదీపట్నం

సికింద్రాబాద్ టు మణికొండ.. వయా మెహిదీపట్నం
X

హైదరాబాద్ లోని సిటీ బస్ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ మీదుగా నూతనంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మించిన విషయం తెలిసిందే. ఆ రూట్ లలో వెళ్లే బస్సులను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో మాదిరిగానే ఉప్పల్ 113 బస్ లు ఆ మార్గంలో ఎప్పటిలాగానే సేవలందిస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అలాగే సికింద్రాబాద్ నుంచి మణికొండకు కొత్త బస్ సర్వీస్ ను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. 5 K, 5M నెంబర్ సర్వీస్ తో మూడు బస్ లు మెహదీపట్నం మీదుగా మణికొండకు వెళ్తుంది.





ఈ బస్ సర్వీస్ బాటా, బైబిల్‌ హౌస్‌, ట్యాంక్‌బండ్‌, సెక్రటేరియట్‌, లక్డికాపూల్‌, మాసాబ్‌ ట్యాంక్‌, మెహిదీపట్నం, టోలీచౌకి, దర్గా, ఓయూ కాలనీ, పంచవటి కాలనీ, మణికొండ మీదుగా తిరుగుతుంది. ఈ సర్వీస్ తొలి బస్ ఉదయం 6:05 గంటలకు సికింద్రాబాద్ నుంచి మొదలై, చివరి సర్వీస్ సాయంత్రం 5:17 గంటలకు ముగుస్తుంది. అలాగే మణికండ నుంచి తొలి బస్ ఉదయం 7:15 నిమిషాలకు ప్రారంభమై, చివరి బస్ సాయంత్రం 6:37తో ముగుస్తుంది.








Updated : 30 Aug 2023 10:41 PM IST
Tags:    
Next Story
Share it
Top