TSRTC: దసరాకు సొంతూళ్లకు వెళ్తున్నారా.. ఈ ఆఫర్ మీకోసం
X
తెలంగాణ పెద్ద పండుగ దసరా వచ్చేస్తుంది. బతుకదెరువు కోసం పట్నం వచ్చినవాళ్లంతా.. పల్లెల బాట పడతారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో నిడిపోతాయి. బస్ లో సీటు దొరకక కొందరు చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ వద్దనుకునేవాళ్లు ముందస్తుగా బస్ టికెట్ బుక్ చేసుకుంటారు. అలా ముందస్తు టికెట్ బుక్ చేసుకునేవాళ్లకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేవాళ్లకు టికెట్ ప్రైజ్ లో 10 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో రానూపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 30లోగా ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ విర్తిస్తుంది. రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో డిస్కౌంట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అడ్వాన్స్ బుకింగ్ కోసం ఆర్టీసీ అధికారికి వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని సూచించారు.