Home > తెలంగాణ > Breaking News : సోనియా బర్త్ డే గిఫ్ట్.. ఎల్లుండి నుంచి మహిళలకు ఫ్రీ బస్ : మంత్రి శ్రీధర్ బాబు

Breaking News : సోనియా బర్త్ డే గిఫ్ట్.. ఎల్లుండి నుంచి మహిళలకు ఫ్రీ బస్ : మంత్రి శ్రీధర్ బాబు

Breaking News : సోనియా బర్త్ డే గిఫ్ట్.. ఎల్లుండి నుంచి మహిళలకు ఫ్రీ బస్ : మంత్రి శ్రీధర్ బాబు
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం, మంత్రుల మధ్య జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల అమలుపై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. కాగా ముందుగా రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. సోనియా గాంధీ పుట్టిన రోజున (డిసెంబర్ 9) కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో రెండింటినీ అమలు చేస్తామని చెప్పారు. మార్పు కోరుకునే వారికి రాబోయే ఐదేళ్లలో మార్పు చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించగా.. 2014 నుంచి డిసెంబర్ 7,2023 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రులు, అధికారులంతా పంటనష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రైతులకు కావాల్సిన తక్షణ సాయం అందజేస్తామని చేప్పారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించి 200 యూనిట్ల ఉచిత కరెంట్ పై చర్చిస్తారని చెప్పారు. ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని శ్రీధర్ బాబు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక ఉంటుందని స్పష్టం చేశారు. ఎల్లుండి నుంచి మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వరకు పెంపును అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. తాము


Updated : 7 Dec 2023 4:20 PM GMT
Tags:    
Next Story
Share it
Top