Home > తెలంగాణ > తెలంగాణ ఆర్టీసీకి రికార్డు కలెక్షన్స్..ఒక్క రోజే అన్ని కోట్లా?

తెలంగాణ ఆర్టీసీకి రికార్డు కలెక్షన్స్..ఒక్క రోజే అన్ని కోట్లా?

తెలంగాణ ఆర్టీసీకి రికార్డు కలెక్షన్స్..ఒక్క రోజే అన్ని కోట్లా?
X

తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ ఎంతో ఘనంగా జరిగింది. తమ తోడబుట్టిన వారికి అక్కా చెల్లెల్లు రాఖీ కట్టి ప్రేమను చాటుకున్నారు. సోదరులు ఎంత దూరంలో ఉన్నా వారి ఇంటికి వెళ్లి రాఖీ కట్టి అనుబంధాలకు విలువనిచ్చారు సోదరీమణులు. ఇదే సమయంలో రాఖీ పండగ మాత్రం తెలంగాణ ఆర్టీసీకి కాసులు వర్షం కురిపించింది. పండుగ నేపథ్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీని ఆశ్రయించడంతో గురువారం టీఎస్ఆర్టీసీ భారీ కలెక్షన్లు వచ్చాయి. గురువారం ఒక్కరోజే ఆర్టీసీకి ఏకంగా రూ. 20.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం పట్ల సంస్థ చైర్మన్ జాజిరెడ్డి గోవర్థన్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులకు, ఎంప్లాయిస్‏ను ప్రత్యేకంగా అభినందించారు.

రాఖీ పండుగ సందర్భంగా బుధవారం, గురువారం రెండు రోజులు రాష్ట్ర వ్యప్తంగా 9 వేల బస్సుల సర్వీసులను నడిపింది టీఎస్ఆర్టీసి. ఈ రెండు రోజులు ఫుల్ రష్‎తో బస్సులు నడిచాయి. బుధవారం ఆర్టీసీ కలెక్షన్ రూ.18.25 కోట్లు కాగా, గురువారం రూ.19 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్టీసీ అంచనా వేస్తోంది. సాధారణ రోజుల్లో రూ.15 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. గత ఏడాది రాఖీ సందర్భంగా రికార్డు స్థాయిలో సంస్థకు రూ.20.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి ఈ రికార్డు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రికార్డు స్థాయిలో ఆర్టీసీకీ ఆదాయం రావడం పట్ల సంస్థ చైర్మన్ గోవర్థన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీని మరింత ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.రానున్న రోజుల్లో మరిన్ని రాయితీలతో నూతన పథకాలను ప్రవేశపెడతామన్నారు. కార్గో, బస్సు సర్వీసుల్లోనూ అనేక రాయితీలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీకి అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు.


Updated : 1 Sep 2023 10:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top