Home > తెలంగాణ > మరో 3 రోజుల్లో హైదరాబాద్ రోడ్లపై RTC ఎలక్ట్రిక్ బస్సులు

మరో 3 రోజుల్లో హైదరాబాద్ రోడ్లపై RTC ఎలక్ట్రిక్ బస్సులు

మరో 3 రోజుల్లో హైదరాబాద్ రోడ్లపై RTC ఎలక్ట్రిక్ బస్సులు
X

ప్రయాణికులకు చేరువయ్యే క్రమంలో తెలంగాణ రోడ్‌ రవాణా సంస్థ (TSRTC).. ఎప్పటికప్పడు సరికొత్త విధానాలను అమలు చేస్తున్నది. తాజాగా మరో వార్తతో ముందుకు వచ్చింది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌ రోడ్లపై ఆర్టీసీ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయని ప్రకటించింది. ఈ నెల చివరి నాటికి 25 ఈవీ బస్సులను సిటీలో తిప్పనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. గ్రేటర్‌లో మూడు విభాగాల బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో 2,800 బస్సులు నడుస్తున్నాయి. రోజుకి సుమారు 7.5 లక్షల కి.మీలు తిరుగుతున్నాయి. నిత్యం 19 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేరుస్తున్నాయి. గ్రేటర్‌లో 25 డిపోలు ఉండగా.. ఒక్కో డిపో సరాసరిగా సుమారు 5,500ల లీటర్ల నుంచి 6వేల లీటర్ల వరకు డీజీల్‌ను వినియోగిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో విమానాశ్రయానికి మాత్రమే ఎలక్ట్రిక్‌ బస్సులను నడపగా.. త్వరలోనే నగరంలో ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆర్టీసీ అంచనా ప్రకారం ఒక్కో ఎలక్ట్రిక్‌ బస్సుతో కిలో మీటర్‌కు సుమారు రూ.50 వరకు ఖర్చు అవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 175కి.మీ వరకు తిరుగుతాయి. కానీ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య ఉడటంతో 150కి.మీ వరకు తిరుగుతాయని అధికారులు చెబుతున్నారు. తర్వలోనే రాణిగంజ్ , హయత్ నగర్-2, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కూకట్ పల్లి డిపోలలో విద్యుత్ ఛార్జింగ్‌ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది.




Updated : 26 July 2023 9:47 AM IST
Tags:    
Next Story
Share it
Top