Home > తెలంగాణ > మహిళలకు గుడ్ న్యూస్..ఆ రూట్‎లో స్పెషల్ బస్సులు

మహిళలకు గుడ్ న్యూస్..ఆ రూట్‎లో స్పెషల్ బస్సులు

మహిళలకు గుడ్ న్యూస్..ఆ రూట్‎లో స్పెషల్ బస్సులు
X

మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. కోటీ నుంచి కొండాపూర్ వరకు స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తాజాగా ప్రకటించింది. 127K నంబర్‌తో నడిచే ఈ లేడీస్ స్పెషల్ బస్సులు 21వ తేదీ అంటే సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

టీఎస్ఆర్టీసీ బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను, పథకాలను ప్రవేశపెడుతోంది. ప్రయాణికులు ఆర్టీసీ సేవలు వినియోగించుకునేందుకు వీలుగా సరికొత్త సర్వీసులను, రాయితీలను అందిస్తోంది. ఈ కొత్త కార్యక్రమాల ద్వారా ఆర్టీసీ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ప్రయాణికులను ఆకర్షిస్తోంది. లేటెస్టుగా మహిళల కోసం స్పెషల్ బస్సులు నడపాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో కోటీ నుంచి కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు సర్వీసులను నడపబోతోంది.

ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ప్రకటన విడుదల చేశారు.

ఆగస్టు 21 నుంచి 127K నంబర్ స్పెషల్ బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఈ బస్సు ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. అలా లక్దికాపుల్, మాసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్ మీదుగా ఈ బస్సు కొండాపూర్ కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి చేరుకుంటుంది.

TSRTC good news for women passengers

TSRTC, good news, women passengers,special services, 127K , august 21, koti, Kondapur, Lakdikapul, Masab Tank, MLA Colony, Usha Kiran, Shilparam, Kothaguda X Road, Hyderabad, MD, sajjanar, twitter, women special, latest news, Telangana, Telangana news, మహిళలు, ప్రయాణికులు, శుభవార్త, కోఠి, కొండాపూర్, లేడీస్ స్పెషల్ బస్సులు

Updated : 18 Aug 2023 9:01 PM IST
Tags:    
Next Story
Share it
Top