Home > తెలంగాణ > రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌‌కు బస్సులు

రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌‌కు బస్సులు

రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌‌కు బస్సులు
X

ఇకపై రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కు 15 నిమిషాలకో బస్సు నడపనున్నారు. ఎయిర్‌పోర్ట్‌ కు ఇప్పటికే 40కి పైగా ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు నగరం నలువైపుల నుంచి నడుస్తుండగా.. మరో 5 కేంద్రాల(రూట్ల) నుంచి నాన్‌ ఏసీ బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ప్రకటించింది. ఈనెల 15వ తేదీ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ఈ బస్సుల్లో సాధారణ టికెట్‌ ధరలే ఉంటాయని.. మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని గ్రేటర్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

రూటు నంబరు 295ఏ: కేపీహెచ్‌బీ మెయిన్‌ రోడ్డు-రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్ట్‌కుమధ్య 4 ఆర్డినరీ బస్సులు వేశారు.

రూటు నంబరు 229/95ఏ: సుచిత్ర - ఎయిర్ పోర్ట్‌ మధ్య 5 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నారు.

రూటు నంబరు 3కె/95ఏ: ఈసీఐఎల్‌ క్రాస్‌ రోడ్సు - ఎయిర్ పోర్ట్‌ మధ్య 4 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు తిప్పనున్నారు.

రూటు నంబరు 303 బస్సు కొండాపూర్‌ - ఎయిర్ పోర్ట్‌ మధ్య 4 సిటీ ఆర్డినరీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.

రూటు నంబరు 90ఎల్‌/251ఏ బస్సు సికింద్రాబాద్‌ - ఎయిర్ పోర్ట్‌ మధ్య 4 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడపనున్నారు.

Updated : 14 Dec 2023 9:51 AM IST
Tags:    
Next Story
Share it
Top