Home > తెలంగాణ > హైదరాబాద్ - విజయవాడ రెగ్యులర్ బస్ సర్వీసులు రద్దు

హైదరాబాద్ - విజయవాడ రెగ్యులర్ బస్ సర్వీసులు రద్దు

హైదరాబాద్ - విజయవాడ రెగ్యులర్ బస్ సర్వీసులు రద్దు
X

హైదరాబాద్ విజయవాడ మధ్య నడిచే రెగ్యులర్ బస్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. నేషనల్ హైవేపై వరద నీటి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి ఇంకా కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలో ఆ రూట్లో రాకపోకలు స్థంభించాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో రెగ్యులర్‌ సర్వీసులను టీఎస్ ఆర్టీసీ రద్దు చేసింది.

హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపనున్నట్లు వీసీ సజ్జనార్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు చొప్పున హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరుతుందని చెప్పారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.



Updated : 28 July 2023 9:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top