ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
X
కొత్త కొత్త ఆఫర్లు, రాయితీలతో ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ ఆకర్షిస్తోంది. ఇటీవల కాలంలో ప్రైవేట్ బస్సులకు ధీటుగా సర్వీసులను నడుపుతోంది. ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు..ప్రజలను బస్సులు ఎక్కే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మరోసారి ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టికట్ల రేట్లలో రాయితీని కల్పించింది. బెంగుళూరు, విజయవాడ రూట్‌లలో టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ కల్పించింది. అయితే రానుపోను ఒకే సారి టికెట్ బుక్ చేసుకుంటే..తిరుగు ప్రయాణంలో 10 శాతం రాయితీ లభించనుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో జులై 2 ఈ ఆఫర్ అమలు కానుంది. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగళూరు మార్గంలో రూ.100 వరకు ఒక్కో ప్రయాణికుడు ఆదా చేసుకోవచ్చు. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.com ను సంప్రదించాలని వారు సూచించారు