Home > తెలంగాణ > దసరాకు ఆర్టీసీ బస్లో ఇంటికి వెళ్తున్నారా..? ఇది తెలుసుకోండి

దసరాకు ఆర్టీసీ బస్లో ఇంటికి వెళ్తున్నారా..? ఇది తెలుసుకోండి

దసరాకు ఆర్టీసీ బస్లో ఇంటికి వెళ్తున్నారా..? ఇది తెలుసుకోండి
X

దసరా, బతుకమ్మ పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేశారు. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గతేడాది కన్నా 1000 బస్సులను అదనంగా నడపనున్నట్లు చెప్పుకొచ్చారు. 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. అంతేకాకుండా సద్దుల బతుకమ్మ (అక్టోబర్ 22), మహర్నవమి (అక్టోబర్ 23), దసరా (అక్టోబర్ 24) రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి రాష్ట్ర నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు బస్సులు నడుస్తాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, కేపీహెచ్బీ, ఉప్పల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అయితే స్పెషల్ బస్ సర్వీసులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయమని స్పష్టం చేశారు. కాగా ప్రతీ పది నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటుందని సజ్జనార్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వాళ్లకు డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వాళ్లు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inలో చేసుకోవచ్చు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సజ్జనార్‌ సూచించారు.




Updated : 1 Oct 2023 3:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top