Home > తెలంగాణ > Tsrtc: టీఎస్ఆర్టీసీ కొత్త ప్లాన్.. ఆ బస్సుల్లో ఫ్రీ ఇంటర్నెట్

Tsrtc: టీఎస్ఆర్టీసీ కొత్త ప్లాన్.. ఆ బస్సుల్లో ఫ్రీ ఇంటర్నెట్

Tsrtc: టీఎస్ఆర్టీసీ కొత్త ప్లాన్.. ఆ బస్సుల్లో ఫ్రీ ఇంటర్నెట్
X

దూర ప్రయాణాలు చేసే ప్యాసింజర్ల కోసం టీఎస్ఆర్టీసీ మరో సేవ అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించింది. ప్రస్తుతం కొన్ని బస్సుల్లోనే వైఫై అందుబాటులో ఉండగా.. త్వరలోనే మరిన్ని బస్సులకు విస్తరించనున్నారు. ఫ్రీ వైఫైకు సంబంధించిన విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్టర్లో ట్వీట్ చేశారు.

తొలి విడతగా కొత్తగా ప్రవేశపెట్టిన 16 ఏసీ స్లీపర్ బస్సుల్లో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో నడవనున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ లాంఛనంగా ప్రారంభించిన ఈ బస్సుల్లో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ అందుబాటులోకి తెచ్చారు. దాన్ని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేశారు. ఏసీ స్లీపర్ బస్సుల్లో 15 లోయర్ బెర్త్‌లు, 15 అప్పర్ స్లీపర్ బెర్త్‌లు ఉన్నాయి. ఈ బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలతో పాటు పాటు ప్రతీ బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా సదుపాయం ఉంది.

ప్రయాణీకుల సంఖ్య పెంచేందుకు ఇటీవల టీఎస్ఆర్టీసీ సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తోంది. టీ 9 టికెట్లు, గమ్యం యాప్ ద్వారా బస్ ట్రాకింగ్ సిస్టంను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ఇస్తామని ప్రకటించింది. తాజాగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఇబ్బంది తలెత్తకుండా ఫ్రీ వైఫై అందుబాటులోకి తెచ్చింది.

Wifi in TSRTC..

Updated : 6 Sept 2023 5:42 PM IST
Tags:    
Next Story
Share it
Top