Home > తెలంగాణ > స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. బస్ పాస్ రెన్యూవల్ కోసం కొత్త విధానం

స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. బస్ పాస్ రెన్యూవల్ కోసం కొత్త విధానం

స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. బస్ పాస్ రెన్యూవల్ కోసం కొత్త విధానం
X

రాష్ట్రంలో అవసరమైన విద్యార్థులందరికీ టీఎస్ఆర్టీసీ బస్ పాస్ అందిస్తోంది. లక్షల మంది విద్యార్థులు రాయితీపై బస్ పాస్ తీసుకొని లబ్ది పొందుతున్నారు. అయితే స్టూడెంట్స్ ప్రతినెల పాస్ రెన్యూవల్ కోసం బస్ పాస్ కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూలైన్ లో నిల్చోవాల్సిన పరిస్థితి. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు బస్ పాస్ రెన్యూవల్ కోసం కొత్త విధానం అమల్లోకి తీసుకువచ్చారు. స్టూడెంట్స్ క్యూలైన్లలో నిల్చునే బాధ తప్పించాలని నిర్ణయించిన అధికారులు బస్ పాస్ లను ఆన్ లైన్ లో రెన్యూవల్ చేసుకునేలా అవకాశం కల్పించారు.

ఎలా అప్లై చేయాలంటే..

విద్యార్థులు TSRTC బస్ పాస్ అధికారిక వెబ్‌సైట్‌ https://online.tsrtcpass.inలో లాగిన్ అవ్వాలి. అందులో అప్లై బటన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి జిల్లాను ఎంచుకోవాలి. ఆ తర్వాత Students services సెక్షన్​ను సెలెక్ట్ చేసుకుని అప్ డేట్ డీటెయిల్స్ ఆప్షన్​పై క్లిక్ చేయాలి. ఆన్ లైన్ రిజిస్టర్డ్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే బస్ పాస్ అప్లికేషన్ ఫాం కనిపిస్తుంది. అందులో విద్యార్థి పర్సనల్, అడ్రస్, స్కూల్ తదితర వివరాలను నమోదు చేయాలి. రూట్ వివరాలను కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డ్రాప్-డౌన్ మెనూ నుంచి “పేమెంట్ మోడ్ అండ్ పాస్ కలెక్షన్” ఆప్షన్ ఎంచుకోవాలి. వివరాలను వెరిఫై చేసుకున్న అనంతరం సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి బస్ పాస్ డబ్బు చెల్లించాలి. పేమెంట్ పూర్తైన తర్వాత టీఎస్ ఆర్టీసీ బస్ పాస్ మంజూరు అవుతుంది. అప్లికేషన్ ఫాంను డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. అందులో.. పాస్ ఎప్పుడు వస్తుందనే డేట్ ఉంటుంది.







Updated : 28 Aug 2023 10:16 PM IST
Tags:    
Next Story
Share it
Top