Home > తెలంగాణ > టీ9 టికెట్.. 30 కిలోమీటర్లు కేవలం రూ.50లో

టీ9 టికెట్.. 30 కిలోమీటర్లు కేవలం రూ.50లో

టీ9 టికెట్.. 30 కిలోమీటర్లు కేవలం రూ.50లో
X

గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆర్టీసీ ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది. అందులో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ టీ9 టికెట్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వల్ప దూరం ప్రయాణించే వాళ్లకోసం మరో రాయితీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా టి9-30 టికెట్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే టీ9-60 వాడకంలో ఉండగా ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

టీ9-30 టికెట్ ద్వారా ప్రయాణికులు రూ.50కే 30 కిలోమీటర్ల జర్నీ చేయొచ్చు. ఒక రోజులో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రయాణించేలా పాస్ అందజేయనుంది. ఈ పథకం రేపటి (జులై 27) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ టికెట్ ద్వారా కేవలం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ప్రయాణించేందుకు వీలుంది. అయితే, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించాలంటే రూ.20 అదనంగా చెల్లించాలని తెలిపింది.

Updated : 26 July 2023 10:29 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top