Home > తెలంగాణ > మొబైల్‎లో ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్...టీఎస్ఆర్టీసీలో సరికొత్త వ్యవస్థ

మొబైల్‎లో ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్...టీఎస్ఆర్టీసీలో సరికొత్త వ్యవస్థ

మొబైల్‎లో ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్...టీఎస్ఆర్టీసీలో సరికొత్త వ్యవస్థ
X

టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టాక..ఆర్టీసీ ప్రయాణాన్ని మరింత సౌకర్యంగా మాట్లాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మరో వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా మనకు కావల్సిన బస్సు సమయాన్ని గమనించవచ్చు. మీరు ఎక్కాల్సిన బస్సు.. ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఉంది అనేది ఈజీగా తెలిసిపోనుంది. బస్సుల రాకపోకల సమయాన్ని ప్రయాణికులు ఈజీగా గుర్తించడం కోసం టీఎస్ఆర్టీసీ సరికొత్తగా ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది .

దీని కోసం గమ్యం అనే పేరుతో కొత్త యాప్‎ను తీసుకొచ్చారు. ఈ యాప్‌ని ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఆర్టీసీకి చెందిన మొత్తం 4170 బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించారు. హైదరాబాద్‌లోని పుష్పక్, మెట్రో సర్వీసులకు దీనిని అనసంధానం చేశారు. ఒక్క పల్లెవెలుగు బస్సుల్లో మాత్రం ఈ సేవలను పొందలేము. ఈ యాప్ లో కేవలం బస్ ట్రాకింగ్ సదుపాయమే కాకుండా మహిళల భద్రత నిమిత్తం పలు ఫీచర్లను అమర్చారు. డయల్ 100,108 ద్వారా కూడా ఈ యాప్ ద్వారా ఫోన్ చేసే అవకాశం ఉంది.



Updated : 12 Aug 2023 2:57 PM IST
Tags:    
Next Story
Share it
Top