Home > తెలంగాణ > మహాలక్ష్మి పథకానికి కొత్తగా 1325 బస్సులు.. శ్రీశైలం ఘాట్ రోడ్డుకు ప్రత్యేకంగా

మహాలక్ష్మి పథకానికి కొత్తగా 1325 బస్సులు.. శ్రీశైలం ఘాట్ రోడ్డుకు ప్రత్యేకంగా

మహాలక్ష్మి పథకానికి కొత్తగా 1325 బస్సులు.. శ్రీశైలం ఘాట్ రోడ్డుకు ప్రత్యేకంగా
X

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా.. మహాలక్ష్మీ పథకాన్ని ప్రకటించింది. అధికారం చేపట్టిన అనంతరం ముందుగా.. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని పార్టీ నేతలు ప్రకటించారు. ఫ్రీ జర్నీ పథకాన్ని అందరూ వినియోగించుకుంటున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ భాగా పెరిగిపోయింది. ఈ రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. జూన్ 2024 నాటికి 1325 బస్సులను దశల వారీగా వాడకంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్‌ ప్రెస్‌, 75 డీలక్స్‌, 138 లహరి/రాజధాని బస్సులు ఉన్నాయి. ఈ 1325లో ఇప్పటికే కొన్ని అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా మరో 100 బస్సులను టీఎస్ఆర్టీసీ ప్రారంభించనుంది.

ఈ 100 బస్సుల్లో 90 ఎక్స్ ప్రెస్ లు, 10 రాజధాని బస్సులు ఉన్నాయి. ఈ 90 ఎక్స్ ప్రెస్ బస్సులు మహిళలకు ఫ్రీ జర్నీకి ఉపయోగపడగా.. మిగిలిన 10 రాజధాని బస్సులు శ్రీశైలం ఘాట్ రోడ్డుకు అనుగుణంగా తొలిసారి టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టింది. శ్రీశైలానికి వెళ్లే భక్తులు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్.. wwww.tsrtconline.in ద్వారా సీట్లను ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు.

Updated : 10 Feb 2024 11:01 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top