TSRTC: సమ్మె ఆలోచన విరమణ.. రేపట్నుంచి యథావిధిగానే బస్సులు
X
పెరిగిన రద్దీ కారణంగా తాము ఇబ్బందిపడుతున్నామని, బస్సులు పాడవతున్నాయని ఆర్టీసీ అద్దె బస్సు యజమానులు తమ సమస్యను తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో TSRTC ఎండీ సజ్జనార్‌తో సమావేశమయ్యారు. అద్దె బస్సుల యజమానులతో చర్చలు సఫలమయ్యాయని సజ్జనార్ తెలిపారు. అద్దె బస్సుల యజమానులు... మహాలక్ష్మి పథకం వల్ల వారికి ఎదురు అవుతున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు సజ్జనార్. వారం రోజుల్లో వారి సమయాలను మొత్తం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. ఇందుకోసం ఒక కమిటీ ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రం లో దాదాపుగా 2700 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ చర్చలతో అద్దె బస్సు ఓనర్ల సమ్మె విరమించుకున్నట్టేనని, రేపటి నుండి ఎలాంటి సమ్మె ఉండదని తెలిపారు. రేపటి నుంచి యాథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని, సంక్రాంతికి కూడా ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయని.. స్పెషల్ బస్సులు నడుపుతామని సజ్జనార్ స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారం కోసం ఎండీ సజ్జ నార్ గారిని కలిశామని చెప్పారు అద్దె బస్సుల యజమానులు. ముఖ్యంగా 5 సమస్యలను ఎండీ సజ్జనార్ కి విన్నవించామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ నెల 10 వ తేదీలోపల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నామని తెలిపారు