ఐటీ కారిడార్కు ప్రారంభమైన లేడీస్ స్పెషల్ బస్
X
హైదరాబాద్లోని ఐటీ కారిడార్‌లో టీఎస్‌ఆర్టీసీ మహిళల కోసం ప్రత్యేక బస్సును ప్రారంభించింది. జేఎన్‌టీయూ-వేవ్‌రాక్ మార్గంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బస్సు నడవనుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. మహిళా ప్రయాణికుల సౌకర్యం కోసం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఐటీ కారిడార్‌లో పనిచేసే మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో లేడీస్ స్పెషల్ బస్సు ఈ రోజు ప్రారంభమైంది. జేఎన్‌టీయూ-వేవ్ రాక్ మార్గంలో ఈ ప్రత్యేక బస్సు ఉదయం, సాయంత్రం నడుస్తుంది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేయనుంది. ఐటీ కారిడార్‌లో రాకపోకలకు ఈ సదుపాయాన్ని… pic.twitter.com/NSqYsCm2Px
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 31, 2023
ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల కోసం మెట్రో ఎక్స్‌ప్రెస్ లేడీస్ స్పెషల్ బస్సును అందుబాటులోకి తెచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి వేవ్ రాక్ వరకు నడుపుతున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా నడిపే ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. నెక్సెస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్‌రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వేవ్ రాక్ చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటలకు వేవ్ రాక్ నుంచి బయలుదేరి జేఎన్‌టీయూకు వెళ్తుంది.