Home > తెలంగాణ > టీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్..రూ.100 చెల్లిస్తే చాలు..

టీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్..రూ.100 చెల్లిస్తే చాలు..

టీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్..రూ.100 చెల్లిస్తే చాలు..
X

గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతో టీఎస్ఆర్టీసీ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, వృద్ధుల కోసం స్పెషల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 100 రూపాయలతో 60 కిలోమీటర్ల పరిధిలో ‘టి-9 టికెట్’ ద్వారా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‎లో పరిధిలో బస్సులో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే టీఎస్ఆర్టీసీ టి-24, టి-6, ఎఫ్-24 అనే టికెట్లను అందిస్తోంది. తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల కోసం టి-9 టికెట్‏ను అందుబాటులోకి తీసుకురానుంది.




హైదరాబాద్‏లోని బస్ భవన్‎లో శుక్ర‌వారం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ‘టి-9 టికెట్’ పోస్టర్‎ను లాంచ్ చేశారు. ఈ టికెట్లు ఆదివారం నుంచి పల్లె వెలుగు బస్సుల్లో అందుబాటులో ఉంటాయి. బస్సు కండక్టర్ల వద్ద ప్రయాణికులు ఈ టికెట్లను పొందవచ్చు. మహిళలు, సీనియర్ సిటజన్స్‎కు మాత్రమే ఈ టికెట్ వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.100 చెల్లించి, 60 కి.మీ.ల పరిధిలో రానుపోను ప్రయాణం చేయవచ్చు. ఈ నిర్ణయంతో ప్రయాణికులు 20 నుంచి 40 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు ధృవీకరణ కోసం తమ ఆదార్ ను కండక్టర్‎కు చూపించి టి-9 టికెట్ పొందవచ్చు. గ్రామీణ , పట్టణ ప్రజలు ఈ సేవలను వినియోగించుకుని సంస్థను ఆదరించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కోరారు.







Updated : 16 Jun 2023 3:04 PM IST
Tags:    
Next Story
Share it
Top