Home > తెలంగాణ > బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీ.. త్వరలో కర్నాటకకు టీఎస్ఆర్టీసీ అధికారులు

బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీ.. త్వరలో కర్నాటకకు టీఎస్ఆర్టీసీ అధికారులు

బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీ.. త్వరలో కర్నాటకకు టీఎస్ఆర్టీసీ అధికారులు
X

రాష్ట్రంలో రేపు కాంగ్రెస్ సర్కారు కొలువుదీరనుంది. ఈ క్రమంలో ఆరు గ్యారంటీల అమలుపై చర్చ సాగుతోంది. వాటిలో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ క్రమంలో మహిళల ఉచిత ప్రయాణ పథకం అమలుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.

మహిళల ఉచిత ప్రయాణం ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే.. ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడనుందన్న అంశంపై టీఎస్ఆర్టీసీ అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు. కర్నాటకలో పథకం అమలవుతున్న తీరును పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం త్వరలోనే బెంగళూరుకు వెళ్లనుంది. రెండు రోజులపాటు కర్నాటకలో ఈ పథకంను పరిశీలించి నివేదిక సిద్ధం చేయనున్నారు. కొత్త సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఎక్స్ ప్రెస్, ఆర్డీనరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎంతమంది ప్రయాణించారన్న లెక్క తెలుసుకునేందుకు కర్నాటకలో జీరో టికెట్ విధానం అమలు చేస్తున్నారు. దీని ద్వారా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సైతం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. అయితే సిటీ ఆర్డీనరీ బస్సుల్లో మాత్రమే ఈ పథకంను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం తమిళనాడులో ప్రత్యేకంగా పింక్ కలర్ బస్సులను ఉపయోగిస్తున్నారు.

Updated : 6 Dec 2023 4:21 PM GMT
Tags:    
Next Story
Share it
Top