టీ-9 టికెట్ నిలిపేసిన ఆర్టీసీ.. కారణం ఏంటంటే?
X
గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు తెలంగాణ ఆర్టీసీ టీ9 టికెట్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వల్ప దూరం ప్రయాణించే వాళ్లకోసం ఇది కొంత వరకు ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో టీ-9 టికెట్ ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మంగళవారం (ఆగస్ట్ 29) నుంచి 4 రోజుల పాటు టీ9 టికెట్ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే, సెప్టెంబర్ 2 నుంచి టీ9 టికెట్ సేవలు కొనసాగుతాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాఖీ పండగకు బస్సుల్ల ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఆ టైంలో టీ9 టికెట్ ఇవ్వడం సిబ్బందికి సాధ్యం కాదు. టీ9 టికెట్ ఇవ్వడం కోసం ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలన్నీ ఎంటర్ చేస్తారు. పండగ టైంలో రద్దీ ఉంటుంది కాబట్టి.. ఈ వివరాలన్నీ ఎంటర్ చేయడం కుదరదు. ఈ కారణంతో టీ9 టికెట్ ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. టీ9 పేరుతో ఆర్టీసీ రెండు టికెట్లను జారీ చేస్తోంది. 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ9-60ని, 30 కిలోమీటర్ల పరిధిలో టీ9-30 టికెట్లను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. టీ9-60 టికెట్‌ను రూ.100కు, టీ9-30 టికెట్‌ను రూ.50కు ప్రయాణికులకు అందజేస్తోంది.