మంత్రి పువ్వాడపై సంచలన ఆరోపణలు చేసిన తుమ్మల
X
అసెంబ్లీ ఎన్నికలకు మరో 40రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. క్రమంలోనే మంత్రి పువ్వాడపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను ఖాసిం రజ్వీతో పోల్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మంత్రి అజయ్ కుమార్‌ను ఖాసి రజ్వీతో పోల్చారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జనాలు కేవలం అభివృద్ధి కావాలని అడిగేవారని కానీ, ఇప్పుడు మాత్రం తమ భూములు కబ్జా అయ్యాయని జనం లిస్ట్ తీసుకొచ్చి మరీ చెబుతున్నారని అన్నారు. పోలీసులు కూడా అధికారం ఉన్న వారికి అండగా ఉంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని తుమ్మల ఆరోపించారు. మంత్రిగా అజయ్ కుమార్ అభివృద్ధి చేయాల్సిందిపోయి నాలుగేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైరయ్యారు.
తన 40ఏండ్ల రాజకీయ జీవితంలో మైనార్టీలు తనకు అండగా ఉన్నారని తుమ్మల గుర్తు చేశారు. అందుకే వారి సంక్షేమంతో పాటు వారికి ఎన్నో అవకాశాలు దక్కేలా పాటుపడ్డానని అన్నారు. ఖమ్మంలో ఎంతో అభివృద్ధి చేశానన్న తుమ్మల.. ఆరాచకాలు, అవినీతి లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు పాటు పడాలని సూచించారు.