తెలంగాణలో నామినేషన్ల సందడి.. తొలి రోజు ఎవరెవరు వేశారంటే..?
X
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ మొదలైన వెంటనే ఖమ్మం మున్సిపల్ ఆఫీస్‌కి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎలాంటి హడావిడి లేకుండా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి సహా ఆరు గ్యారంటీలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శేర్లింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా పలు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ సమర్పించారు. నవంబర్ 10వ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలిన, నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువిచ్చింది. నవబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.