Home > తెలంగాణ > కజక్‌స్థాన్‌కు రాయబారిగా తెలంగాణ వ్యక్తి

కజక్‌స్థాన్‌కు రాయబారిగా తెలంగాణ వ్యక్తి

కజక్‌స్థాన్‌కు రాయబారిగా తెలంగాణ వ్యక్తి
X

కజక్‌స్థాన్‌కు రాయబారిగా తెలంగాణ వ్యక్తి నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొడకండ్లకు చెందిన టీ.వీ నాగేంద్ర ప్రసాద్ను రాయబారిగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నియామకపత్రం అందజేశారు. నాగేంద్రప్రసాద్ ప్రస్తుతం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌ జనరల్‌గా ఉన్నారు. గత మూడేళ్లుగా ఆయన ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

హైదరాబాద్‌లోని భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఎమ్మెస్సీ చేసిన నాగేంద్రప్రసాద్ 1993లో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసు(ఐఎఫ్‌ఎస్‌)లో చేరారు. టెహ్రాన్‌, లండన్‌, భూటాన్‌, స్విట్జర్లాండ్‌, తుర్క్‌మెనిస్థాన్‌ ఎంబసీల్లో డిప్యూటీ అంబాసిడర్‌గా, అంబాసిడర్‌గా పనిచేశారు. 2018లో విదేశాంగ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత ఆయనను శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌ జనరల్‌గా కేంద్రం నియమించింది. తాజాగా కజక్‌స్థాన్‌కు రాయబారిగా నియమితులైన ఆయన సెప్టెంబరులో బాధ్యతలు చేపడతారు.

Updated : 29 Aug 2023 8:37 AM IST
Tags:    
Next Story
Share it
Top