Home > తెలంగాణ > కేటీఆర్, సిద్ధరామయ్య మధ్య కొనసాగుతున్న ట్వీట్ వార్

కేటీఆర్, సిద్ధరామయ్య మధ్య కొనసాగుతున్న ట్వీట్ వార్

కేటీఆర్, సిద్ధరామయ్య మధ్య కొనసాగుతున్న ట్వీట్ వార్
X

కర్నాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ట్విట్టర్ వేదికగా ఇరువురు నేతల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఉదయం సిద్ధరామయ్య వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. దానిపై స్పందించిన సిద్ధూ అసలైంది ఏదో.. నకిలీ ఏదో తెలుసుకోలేనందుకే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్.. ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ హామీలు నకిలీవని, హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఫేక్ అని విమర్శించారు.

అబద్దపు హామీలతో కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ ప్రజలని మోసం చేసినందుకే ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 9 దాటి పది రోజులైందని, మీరిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా, రూ. 2 లక్షల పంట రుణ మాఫీ, రూ. 4000 పెన్షన్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఎక్కడని ప్రశ్నించారు. మొదటి కేబినెట్ భేటీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత, మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్న మాట ఎటుపోయిందని అన్నారు. అలాగే 3 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో చెప్పగలరా అని సిద్ధరామయ్యను ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Updated : 19 Dec 2023 3:32 PM IST
Tags:    
Next Story
Share it
Top