అప్సరకు ఇదివరకే పెళ్లైంది..!! ఆ ఫోటోలో ఉన్నది ఎవరంటే..?
X
హైదరాబాద్ లోని సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తోంది. నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. తాజాగా మరో కొత్త విషయం బయటికి వచ్చింది. అప్సరకు (Apsara Case)ఇదివరకే మరో వ్యక్తితో పెళ్లైందనే ప్రచారం జరుగుతోంది. అప్సర వివాహానికి సంబంధించినవి అని చెబుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆప్సరకు ఆల్రెడీ పెళ్లైందనీ .. ఆమె మొదటి భర్తతో ఉన్న ఫొటోలు ఇప్పుడు బయటికి వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమా కాదా అన్నది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. నిజంగానే ఆమెకు ఇదివరకే పెళ్లి అయివుంటే.. ఆమె భర్త ఎవరు..? ఇప్పుడు ఎక్కడున్నారు..? భర్త ఉండగా.. అప్సర పూజారి సాయికృష్ణకి ఎందుకు దగ్గరైంది..? అతనితో ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకుంది.? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ హత్య కేసులో... ఆలయ పూజారి సాయికృష్ణకు అప్సరతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా శారీరక సంబంధంగా మారిందని తేలింది. అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్న సాయికృష్ణ.. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర పెళ్లి ఒత్తిడి చేసింది. దీంతో భరించలేకపోయిన సాయికృష్ణ ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించి ప్లాన్ ప్రకారం కారులో హత్య చేసినట్లు తెలిసింది. ఈ హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం అప్సర గర్భవతి కాదని తేలింది. అప్సరను తాను ఎప్పుడూ శారీరకంగా కలవలేదనీ.. ఆమె చెన్నైలో తరచూ తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేదని సాయికృష్ణ పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. జనవరిలో 3 నెలల గర్భిణి అని అప్సర తనతో చెప్పిందనీ.. అప్పుడే తనకు ఆమెపై అనుమానం వచ్చిందని సాయి చెప్పినట్లు సమాచారం.
అంతకుముందు అప్సర గర్భవతి అనీ.. దానికి కారణం తానే అనీ... పోలీసులకు మరోలా స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్సర తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ... ఇద్దరం దిగిన ఫోటోలను బయటపెడతానని బెదిరించిందని, తన పేరు రాసి సూసైడ్ చేసుకుంటానని బ్లాక్‌మెయిల్ చేయడం వల్లే ఆమెను చంపేసినట్లు తెలిపాడు. కారణం ఏదేమైనా ఆమెను ఘోరంగా చంపేశాడు. ఈనెల 3న అప్సరను కారులో శంషాబాద్ తీసుకెళ్లిన పూజారి సాయికృష్ణ అత్యంత దారుణంగా తలపై బండరాయితో కొట్టి ఆమెను చంపాడన్నది నిజం. ఆ తర్వాత డెడ్‌బాడీని సరూర్‌నగర్ తీసుకొచ్చి.. ఓ మ్యాన్‌హోల్‌లో పడేశాడని తెలిసింది. ఈ విషయాన్ని సాయికృష్ణ ఒప్పుకోవడంతో.. పోలీసులు అప్సర డెడ్‌బాడీని రికవరీ చేశారు.