బండి సంజయ్-కవిత మధ్య ట్విట్టర్ వార్...
X
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదన్న బండి సంజయ్ ట్వీట్‌కు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే కవిత చేసిన ట్వీట్‌కు రిప్లైగా బండి మరోసారి విమర్శులు గుప్పించారు.
ఏం జరిగిందంటే..
ఇవాళ ఉదయం బండి సంజయ్ ఓ ట్వీట్ చేశారు. "గవర్నర్ కు దక్కదు గౌరవం, ఆడబిడ్డలకు లేదు అండ. గిరిజన మహిళలపై పోలీస్ గిరీ. బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం.
ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం. అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం" అంటూ విమర్శించారు.
గవర్నర్ కు దక్కదు గౌరవం
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 13, 2023
ఆడబిడ్డలకు లేదు అండ
గిరిజన మహిళలపై పోలీస్ గిరీ
బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం
ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం
అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం.
దీనికి కౌంటర్‌గా కవిత ట్వీట్ చేస్తూ " పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కలేదు. దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు లేవు. ఢిల్లీ నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. నినాదాలకే న భేటీ బచావో... భేటీ పడావో పరిమితమైంది. విపరీతంగా పెరిగిన సిలిండర్ ధరలు వంటగదిలో మహిళలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం. ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం. ఆడబిడ్డ తలుచుకుంది ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది" అంటూ హెచ్చరించారు.
పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 13, 2023
దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు
దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం… https://t.co/V05XeA3vR5
అయితే కవిత ట్వీట్ పై మరోసారి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. " సొంత పార్టీలో మహిళా నేతలపైనే అకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై చర్యలు లేవు.
ఆడబిడ్డలను వేధించి పీడించి ప్రాణాలు తీసుకునే స్థితికి చేరినా ఆ నేతలపై చర్యలు శూన్యం. పోడు భూముల కోసం పోరుబాట పట్టిన ఆడబిడ్డల చేతికి సంకెళ్ళేసారు. పసి బిడ్డ నుండి పండు ముసలి వరకూ ఎవరికీ రక్షణ లేదు. తొలి క్యాబినెట్లో కనీసం ఒక్క మహిళలకూ చోటు దక్కలేదు. పాయఖానాలు సైతం లేక ఆడకూతుర్లు అవస్థలు పడుతుంటే స్పందించ లేదు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో దగా చేసి మహిళల్ని గోస పెట్టిస్తున్నారు. బాలింతలు మృతి చెందినా పరామర్శించని కర్కశత్వం.రాజకీయాల కోసం మహిళా బిల్లంటూ వీధులకెక్కి నాటకాలు చేస్తున్న తీరుని తెలంగాణ మహిళా లోకం ఏనాడో పసిగట్టింది.. గులాబీ పార్టీ పని పడుతుంది" అని బండి సంజయ్ రాసుకొచ్చారు.
సొంత పార్టీలో మహిళా నేతలపైనే అకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 13, 2023
ఆడబిడ్డలను వేధించి పీడించి ప్రాణాలు తీసుకునే స్థితికి చేరినా ఆ నేతలపై చర్యలు శూన్యం
పోడు భూముల కోసం పోరుబాట పట్టిన ఆడబిడ్డల చేతికి సంకెళ్ళేసిన వైనం
పసి బిడ్డ నుండి పండు ముసలి వరకూ ఎవరికీ లేని రక్షణ
తొలి… https://t.co/vCascYTN3Y