Home > తెలంగాణ > Nalgonda : వాట్సప్ డీపీ మార్ఫింగ్.. డిగ్రీ విద్యార్థినుల ఆత్మహత్య

Nalgonda : వాట్సప్ డీపీ మార్ఫింగ్.. డిగ్రీ విద్యార్థినుల ఆత్మహత్య

Nalgonda : వాట్సప్ డీపీ మార్ఫింగ్.. డిగ్రీ విద్యార్థినుల ఆత్మహత్య
X

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కొందరు ఆకతాయిలు చేసిన అసభ్య పనికి ఇద్దరు విద్యార్థినులు తమ ప్రాణాలను బలితీసుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ సంఘటనచోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు డిగ్రీ చదువుతున్నారు. వీరిద్దరూ నల్గొండ జిల్లాలోని ఓ హాస్టల్ లో ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తుంటారు. మంగళవారం కాలేజీలో ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిన విద్యార్థినులు.. ఉదయం 9 గంటల ప్రాంతంలో నల్గొండకు వచ్చారు. ఎన్జీ కాలేజీ వెనకాల ఉన్న రాజీవ్ పార్క్ కు వెళ్లి చాలా సేపు అక్కడ కూర్చున్నారు. అనంతరం అక్కడే కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ దారుణాన్ని హాస్టల్ లో ఉన్న ఓ ఫ్రెండ్ కు ఫోన్ చేసి చెప్పారు.





తరువాత ఆ పార్క్ నుంచి బయల్దేరారు. గేటు బయట ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి కుప్పకూలిపోయారు. వారిని స్థానికులు గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆమెను హుటాహుటిన నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం వారిద్దరూ ఐసీయూలో ట్రీట్ మెంట్ పొందుతూ కాసేపటి క్రితమే మరణించారు. కాగా.. వాట్సాప్ లోని తమ డీపీలను తీసుకొని కొందరు యువకులు మార్పింగ్ చేశారని, వాటిని ఇన్ స్టాలో పోస్టు చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని బాధితులు పేర్కొన్నారు. అందుకే తాము ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్టు చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నల్గొండ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థినులు అమ్మనబోలు గ్రామానికి చెందిన మనీషా, నక్కలపల్లి గ్రామానికి శివాని లు గా గుర్తించారు

అమ్మాయిల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నల్గొండ టూ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అమ్మాయిలను వేధించి.. బ్లాక్​మెయిల్ చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఆ యువతల మొబైల్ ఫోన్ సంభాషణలను పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు తమ కూతుళ్ల మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మృతురాళ్ల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు







Updated : 6 Sept 2023 11:24 AM IST
Tags:    
Next Story
Share it
Top