Home > తెలంగాణ > 15 లక్షల గడ్డి తింటూ అడ్డంగా దొరికిన ఈడీ అధికారులు

15 లక్షల గడ్డి తింటూ అడ్డంగా దొరికిన ఈడీ అధికారులు

15 లక్షల గడ్డి తింటూ అడ్డంగా దొరికిన ఈడీ అధికారులు
X

కంచే చేను మేసింది. అవినీతిని అరికట్టి దోషులను కటకటాల వెనక్కి నెట్టాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. రాజస్తాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్కా పథకం ప్రకారం వీరిని అదుపులోకి తీసుకున్నాయి. చిట్ ఫండ్ మోసానికి సంబంధించి కేసు నమోదు నమోదు చేయకుండా ఉండాలంటే తమకు లంచం ఇవ్వాలని నవల్ కిశోర్ మీనా, బాబూలాల్ మీనా అనే ఈడీ అధికారులు డిమాండ్ చేశారు. కిశోర్ మణిపూర్ రాజధాని ఇంఫాల్‌, బాబూలాల్ జైపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరి అవినీతి గురించి రాష్ట్ర ప్రభుత్వానికి పక్కా సమాచారం అందడంతో కన్నేసి అదుపులోకి తీసుకున్నారు. ఇంఫాల్‌కు చెందిన ఓ చిట్‌ఫండ్ వ్యాపారి కేసు పెట్టకుండా ఉండాలంటే రూ. 17 లక్షలు ఇవ్వాలని నవల్ డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యాపారి రాజస్తాన్ ఏసీబీకి విషయం చెప్పడంతో వలపన్ని నవీన్, బాబూలాల్లను అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం వెనక వెనక రాజకీయ కోణం ఉండడం గమనార్హం.

రాజస్తాన్ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్ కొడుకు వైభవ్‌ను ఈడీ అధికారులు మనీ ల్యాండరింగ్ కేసులో గత నెల 30న ఏకంగా 9 గంటలపాటు విచారించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తమ నేతలను వేధిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులను లంచం కేసులో రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.


Updated : 2 Nov 2023 8:06 PM IST
Tags:    
Next Story
Share it
Top